జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. ఈ కార్యక్రమం మలివిడతగా ఫిబ్రవరి 21 వ తేదీ ప్రారంభమైంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. మనోహర్  హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదం జరిగి మరణిస్తే ఐదు లక్షల భీమా లేక గాయాలపాలైతే 10000 నుండి 50000 రూపాయల భీమా లభిస్తుంది.