రఘుదేవపురంలో “జనం కోసం జనసేన మహాపాదయాత్ర”
- దళితవాడలో రేపరేపలాడిన జనసేన పార్టీ జండా
- రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్న మహాపాదయాత్ర
రఘుదేవపురం గ్రామంలో మూడవ రోజు మహాపాదయాత్రలో పాల్గొన్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో – ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు, వారి కుమార్తె వందనాంబిక.. బత్తుల కుటుంబానికి బ్రహ్మరధం పడుతున్న గ్రామ ప్రజలు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ పై ద్రుష్టి పెట్టని ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడ్డ బత్తుల. మూడవ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీ సిద్దాంతాలను వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీ చైన్ అందిస్తూ జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలు ఈ ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను చెప్పుకుంటూ వారి గోడును విన్నవించుకున్నారని ముఖ్యంగా ఈ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని.. మురుగు నీరు వెళ్ళడానికి దారి లేక ఎక్కడికక్కడ నిలిచిపోవడం వలన వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని… దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పరిష్కారం చూపించాలని డిమాండ్ చేసారు.. ఈ పాదయాత్రలో జనసేన సీనియర్ నాయకులు, మండల నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.