రామ్ చరణ్ మరెంతో ఎదగాలి… మన్ననలు పొందాలి

అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన శ్రీ రామ్ చరణ్ కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్నేహభావంతో మెలిగే శ్రీ చరణ్ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలని, అందరి మన్ననలూ అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన శ్రీ చరణ్ కి ఉన్న క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివి. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.