అమ్మఒడికి 13,000 వేల కోట్లు విడుదల చేయాలి: జనసేన

విజయవాడ, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు, కానీ నేటి బాలల భవిష్యత్తు రేపటికి అగమ్యగోచరంగా మారనుంది. ఆంధ్రరాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థులకు అమ్మ ఒడి ద్వారా ఏటా 15 వేల రూపాయలు ఇస్తామని వైసిపి ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఒక కుటుంబంలో ఒక్కరికే అమ్మఒడి అన్న నిబంధనని తీసుకువచ్చింది. రాష్ట్రంలో 54లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా ఈ నిబంధన ద్వారా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు అమ్మఒడికి దూరమయ్యారు. రెండవ సంవత్సరం జనవరి నెల వచ్చేసరికి 75 శాతం హాజరు ఉన్నవారికే అమ్మఒడి అని ఆంక్షలు విధించి బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొనివచ్చింది. దాంతో రెండవ సంవత్సరం అమ్మఒడిని తీసుకునే విద్యార్థుల సంఖ్య లక్షల్లో తగ్గిపోయింది. ఇది చాలదు అన్నట్టు ఏకంగా ఒక సంవత్సరం అమ్మడిని విద్యార్థులకు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో వేయాల్సిన అమ్మఒడిని ఈ ఏడాది జూన్ నెలలో వేస్తాము అనడంపై అమ్మఒడిని పొందే విద్యార్థులు తల్లిదండ్రులలో ఆందోళనలు మొదలయ్యాయి. కేవలం అమ్మఒడితోనే చదువుకునే లక్షలమంది విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అధికారంలో ఉన్న అయిదేళ్లు అమ్మఒడికి ప్రతి ఏటా 6500 కోట్లు విడుదల చేస్తామని ఈ ఏడాది ఇది ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంలో విద్యార్థులను జగన్ మావయ్య మోసం చేశాడని చెప్పాలి. ప్రభుత్వం విద్యార్థులకు జూన్ నెలలో అమ్మఒడికి విడుదలచేసే 6,500 కోట్ల రూపాయలతో పాటు గత సంవత్సరం ఎగ్గొట్టిన అమ్మఒడి డబ్బులతో కలిపి 13 వేల కోట్లు విడుదల చేయాలని జనసేన నాయకులు బొప్పన శ్యామ్ సన్ డిమాండ్ చేశారు. జూన్ నెలలో ప్రతి తల్లి అకౌంట్లో 30 వేల రూపాయలు అమ్మఒడి డబ్బులు వేయాలని లేకపోతే రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు జగన్ మావయ్యకి గుడ్ బాయ్ చెబుతారని జనసేన పార్టీ విజయవాడ నాయకులు బొప్పన శ్యామ్ సన్ పేర్కొన్నారు.