1828 ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్‌ విడుదల

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 1828 ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉంది. ఏయే బ్యాంకుల్లో.. ఎన్ని ఖాళీలున్నాయో తెలుసుకుందామా..!

పోస్టు: స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1)
ఖాళీలున్న బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి వాటిల్లో ఖాళీలున్నాయి.

ఐటీ ఆఫీసర్‌ (స్కేల్‌-1): 220
అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1): 884
రాజ భాష అధికారి (స్కేల్‌-1): 84
లా ఆఫీసర్‌ (స్కేల్‌-1): 44
హెచ్‌ఆర్‌/ పర్సనల్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1): 61
మార్కెటింగ్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1): 535

అర్హతలు: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 2021 నవంబరు 23 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, మిగిలిన అందరికీ రూ.850

దరఖాస్తు చివరి తేదీ..
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 23
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబరు 26
ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష తేదీ: 2022 జనవరి 30
ఇంటర్వ్యూలు: 2022 ఫిబ్రవరి/మార్చి
వెబ్‌సైట్‌ : https://www.ibps.in/