మన ఊరిలో జనవాణి 2వ రోజు

నెల్లిమర్ల: నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు లోకం మాధవి చేపట్టిన మన ఊరిలో జనవాణి కార్యక్రమం అశేష స్పందనతో కొనసాగుతోంది, మన ఊరిలో జానవాణీ 2వ రోజు కార్యక్రమాన్ని చౌడవాడ పంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ చౌడవాడ అభివృద్ధి పరంగా ఎన్నో ఏళ్ళు వెనకబాటు తనానికి గురి అయిందని, ప్రస్తుత పాలకుల పని తీరు చూస్తుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదని పేర్కొన్నారు, కృష్ణాపురంకి చెందిన నేత, జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాలకి ఆకర్షితులై మొన్నం రాజు వైసీపీలో ఇమడలేక జనసేన పార్టీలో లోకం మాధవి అధ్యక్షతన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. చౌడవాడ లోని సమస్యల విన్న మాధవి ఎంతో మనోవేదన చెందారు, కళ్ళు గీత కార్మికులు నివసిస్తున్న రీజుపేటలో గత పదేళ్ళుగా రోడ్డు నిర్మాణం చేపట్టలేదు అంటే ఈ ప్రభుత్వాలకి ఈ ప్రాంతం పైన వున్న అశ్రద్ధ ఏంటో తెలుస్తుందని చురకలంలాటించారు, గర్భిణీ స్త్రీలు ఆ రోడ్డు మార్గంలో పయనిస్తుంటే నరకవేతన అనుభవిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు, కృష్ణాపురం జంక్షన్ నుండి చౌడవాడకి బస్సు సదుపాయం లేదని గ్రామంలో వున్న బాలికలు జంక్షన్ లో బస్సు దిగి రావాలి అని తమకి భద్రత కరువైందని బాలికలు పేర్కొన్నారు, జగనన్న కాలనీలకి సంబంధించి ఇళ్ల పట్టాలు కొండ ప్రాంతాలలో ఇవ్వడం జరిగిందని, అవి చదును చేయటానికి ఎంతో వ్యయంతో కూడిన పని అని పేర్కొన్నారు, జాగా వున్న వారికి ఇంకా బిల్లులు మంజూరు అవ్వలేదు అని గ్రామస్థులు తెలియజేసారు, చౌడవాడ పంచాయతికి చెందిన ఎంతో మంది యువత తమకి ఉద్యోగావకాశలు లేవు అని మొరపెట్టుకున్నారు, కుళాయి సమస్య ఉంది అని 15 రోజులకోసారి మాత్రమే నీరు వదుల్తున్నారు అని ట్యాంకులు ఎప్పుడు శుభ్రం చేయించలేదు అని వాటి వలన తమకి ఎన్నో సమస్యలు ఎదురుకుంటున్నాం అని గ్రామస్థులు వాపోయారు, రోలు చొప్పడి లో రోడ్డు నిర్మాణం జరగకపోతే జనసేన బాధ్యత తీస్కొని వేయిస్తాం అని చెప్పాక ప్రభుత్వం వారు స్పందించి రోడ్డు వేయించారని అది జనసేన విజయంగా బావిస్తున్నట్టు మాధవి తెలియజేశారు.