జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులు
• ఒకే వేదికపై 12 కుటుంబాలకు రూ.60 లక్షల ఆర్థిక సాయం
• రాజమండ్రిలో బీమా చెక్కులు అందచేసిన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రూ.5 లక్షల బీమా చెక్కులు అందచేశారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో 12 కుటుంబాలకు పార్టీ తరఫున రూ. 60 లక్షల సాయాన్ని అందచేశారు. ప్రతి కుటుంబాన్ని పేరుపేరునా పరామర్శించి ఓదార్చారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో పోరాటం చేసిన వారి కుటుంబాలకు భవిష్యత్తులోనూ జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పిల్లల చదువుల బాధ్యతను కూడా పార్టీ తరఫున తీసుకుంటామని శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున హామీ ఇచ్చారు. శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా రూ. 5 లక్షల చెక్కులు అందుకున్న వారి వివరాలు…
1. శ్రీమతి కూన ఉమా మహేశ్వరి (కూన గణేష్) – పెద్దాపురం నియోజకవర్గం
2. శ్రీమతి పుప్పాల ఏగులమ్మ ( పుప్పాల శ్రీను) – పెద్దాపురం నియోజకవర్గం
3. శ్రీమతి కొయ్య మంగ ( గోపాల కృష్ణ) – తుని నియోజకవర్గం
4. శ్రీమతి స్వామిరెడ్డి విజయ దుర్గ ( స్వామిరెడ్డి వీర్రాజు) – పిఠాపురం నియోజకవర్గం
5. శ్రీమతి గాబు వెంకట నాగలక్ష్మి (గాబు వీరబాబు) – ప్రత్తిపాడు నియోజకవర్గం
6. శ్రీమతి అడపా ప్రసన్నకుమారి ( అడపా అయ్యప్పస్వామి) – జగ్గంపేట నియోజకవర్గం
7. శ్రీమతి పెద్దిరెడ్డి వెంకటలక్ష్మి (పెద్దిరెడ్డి ఆదినారాయణ) – ముమ్మడివరం నియోజకవర్గం
8. శ్రీమతి బొబ్బలి వరలక్ష్మి ( బొబ్బిలి సూర్యారావు) – అమలాపురం నియోజకవర్గం
9. శ్రీమతి ఏడిద సత్యవతి ( ఏడిద సత్యనారాయణ) – కొత్తపేట నియోజకవర్గం
10. శ్రీమతి కొప్పిరెడ్డి లక్ష్మి ( కొప్పిరెడ్డి అంజి) – అనపర్తి నియోజకవర్గం
11. శ్రీమతి గెడ్డం భవాని ( గెడ్డం శ్రీనివాసరావు) ముమ్మిడివరం నియోజకవర్గం
12. శ్రీమతి వాకపల్లి నాగ సరస్వతి (వాకపల్లి నాగసతీష్) – అమలాపురం నియోజకవర్గం