నెరవేరిన పాత రావిచర్ల ప్రజల 27 సంవత్సరాల కల

  • పాత రావిచర్ల, రావిచెర్ల మధ్య సరిహద్దు, పెద్ద చెరువు పంపకాలు గ్రామ పెద్దల సమక్షంలో ఏకాబ్రిప్రాయం
  • సోమవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కి స్పందనలో మరీదు శివ రామకృష్ణ ఇచ్చిన పిర్యాదుతో కదిలిన అధికారులు

నూజివీడు రూరల్, పాత రావిచర్ల మరియు రావిచెర్ల రెవిన్యూ సరిహద్దు వివాదమై, ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కి నూజివీడు ఆర్డివో ఆఫీస్ వద్ద గత సోమవారం జరిగిన స్పందన కార్యక్రమం నిర్వహించగా అందులో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ స్పందన కార్యక్రమం ఆర్చిపెట్టగా శుక్రవారం రెండు గ్రామాల సర్పంచ్లను మరియు రెండు గ్రామాల పెద్దలను పిలిపించి, 27 సంవత్సరాలుగా వేచి చూస్తున్న సమస్య పరిష్కారం చేయడం జరిగింది. రెండు గ్రామాల మధ్య సరిహద్దు ఏర్పాటు, పెద్ద చెరువు వాటాలు అన్నీ కూడా ఇరు గ్రామాల పెద్దల సమక్షంలో ఏకగ్రీవ అభిప్రాయాలకు వచ్చి రాతపూర్వకంగా మినిసట్స్ బుక్ లో రాసుకొని రెండు గ్రామాలు సర్పంచులు మరియు పెద్దలు సంతకాలు కూడా చేయడం జరిగింది. అలాగే పరస్పర అంగీకారం వచ్చిన ఈ సమస్యపై రెండు గ్రామాల పాలకవర్గం తీర్మానాలు చేసి రెండు రోజుల్లో అందచేయవలసిందిగా అధికారులు సర్పంచ్ లని కోరారు. ఈ కార్యక్రమంలో పిటిషన్ దారుడు మరియు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరిదు శివరామకృష్ణ, రావిచెర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు, పాత రావిచర్ల మాజీ సర్పంచ్ బసవరాజు, నగేష్ బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు లావు ప్రసాద్, వెనికళ్ళ సాంబయ్య, వైఎస్సార్సీపీ నాయకులు లావు నాగు, పాత రావిచర్ల ఉపసర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, దంతాల నెహ్రూ, జనసేన పార్టీ నాయకులు కోన్నంగుంట రాంబాబు, తోట బలరాం, కస్తూరి అశోక్, టీడీపీ నాయకులు మరీదు హరిబాబు, కోనతం సాంబయ్య, తోట సీతారామరాజు, కడియాల బాబు, బెజవాడ నాగేశ్వరావు, ఈఓపిఆర్డి సరశ్వతీ, సర్వేయర్ రవీంద్ర, గ్రామ సెక్రెటరీలు శ్యామ్, సునంద తదితరులు పాల్గొన్నారు.