పాడేరు జనసేన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జనసేనపార్టీ పాడేరు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య అధ్యక్షతన జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు, జనసైనికులకు, అభిమానులకు, వీరమహిళలకు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇన్చార్జ్ డా.గంగులయ్య సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ఈ నెల 15, 16, 17 తేదీలలో ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన జనవాణి కార్యక్రమం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విపరీతమైన పోలీస్ ఆంక్షలతో విజయవంతంగా నిర్వహించడమనది. ఒకవైపు జనసేన నాయకులను అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసి అధికార పార్టీ అడ్డుకోవాలని చూస్తే ఈ కుతంత్రాలకు దీటుగా ప్రజలు జనసేనపార్టీకి బాసటగా నిలిచారు. ఏజెన్సీ ప్రాంతంలో నుంచి కూడా వేలాదిమంది కార్యకర్తలు తరలి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే, అధికార వైసీపీ పార్టీ వర్గాలు జనసేనపార్టీని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టాలని చూస్తే ఆ దెబ్బ తిరిగి భూమరాంగ్ లాగా వాళ్ళకే తగిలింది. మన ప్రాంతంలో నుంచి కూడా జనవాణి కార్యక్రమంలో కొన్ని సమస్యలపై వినతిపత్రాలు సమర్పించడమైనది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జనసేనపార్టీకి జనాదరణ పెరుగుతున్న మాట వాస్తవం. ఈ విషయం ప్రజలందరికీ తెలిసిందే కానీ, తాచెడ్డ కోతి వనమంతా చెరుచును అన్నట్టుగా వైసీపీ పార్టీ శ్రేణులు విపరీతమైన అసత్య ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలలో ద్వందార్దాలు వచ్చే అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తారు, అటువంటి అసత్య ప్రచారాలు నమ్మి జనసైనికులు ఆత్మస్తైర్యం కోల్పోకూడదు. మనది బలమైన సిద్ధాంతాలతో నిర్మితమై మార్పుకోసం పాటుపడే రాజకీయాలు చేసే పార్టీ ఈ విషయం అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి సమావేశంలో చెప్తూనే ఉన్నారు. పొత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాల విషయం అధినేత చూసుకుంటారు. మనం నేరుగా ప్రజాభిమానం పొందడానికి వాస్తవ సమస్యలపై నిరంతరం పోరాటం చెయ్యాలి. త్వరలోనే జనసేనపార్టీ గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని, అందుకుతగిన కార్యాచరణ రూపొందిస్తామని ఎట్టి పరిస్థితుల్లో జనసైనికులు పార్టీ సిద్ధాంతాలను విస్మరించరాదని, ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రజావ్యతిరేకత ఎందుకు పెరుగుతుందో ఈ ప్రభుత్వ పాలన వ్యవహారాలు చూస్తే సామాన్యులకు కూడా సులభంగానే అర్ధమవుతుందని తెలిపారు. సమస్యలు కోకొల్లలుగా ఉండే గిరిజన ప్రాంతంలో ప్రజలు వైసీపీని ఎంతగానో నమ్మి ఓటు వేసారని, ఫలితం ఇప్పుడు చూస్తున్నారని, జనసేనపార్టీకి రొజు రోజుకి పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేక సోషల్ మీడియా వేదికలో చేసే అసత్యప్రచారాల ఉచ్చులో పడొద్దని జనసైనికులకు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, అశోక్, అశోక్ కిల్లో, సంతోష్, కార్యనిర్వహణ సభ్యులు వి. సురేష్, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, ఉపాధ్యక్షులు ఈశ్వరరావు, తల్లే త్రిమూర్తులు, తల్లే కృష్ణ, బాను ప్రసాద్, చింతపల్లి నాయకులు, వాడకని నాని, వంతల బుజ్జి బాబు, పుండరీనాద్, సందేశ్, స్వామి, రవి, వెంకట్, హుకుంపేట మండల కార్యనిర్వహణ సభ్యులు సురేష్ పర్దని మరియు పలువురు జనసైనికులు పాల్గొన్నారు.