జనసేన కాపు నాయకుల ఆత్మీయ సమావేశం

తాడేపల్లిగూడెంలో బుధవారం జనసేన కాపు నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో వివిధ నియోజకవర్గాల ఇంచార్జీలు పాల్గొన్నాడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి పార్టీలకు అతీతంగా విచ్చేసిన కాపు సోదరులకు, కాపు నాయకులకు, మహిళా సోదరి మణులకు అందరికీ పేరు పేరునా అభినందనలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ మతాలను, కులాలను కలిపే పార్టీ కానీ ఈరోజు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాలను విభజించి పాలించే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ పార్టీలో ఉన్న కాపు నేతలు చట్టసభల్లో ప్రమాణం చేసి బానిస సంకెళ్ళకు విముక్తి కల్పించాల్సిన బాధ్యత ఉన్న మంత్రులు మీరు బానిస అని చెప్పి మంత్రులు ఉన్నారు. వైసీపీ పార్టీలో ఉన్న కాపు నేతలు నాయకులను ప్రశ్నిస్తున్నాం. ఈ మూడు సంవత్సరాల కాలంలో కాపులకు ఏ విధమైన రాయితీలు కల్పించారు. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి కాపులకు బిసి రిజర్వేషన్ చేయిస్తానని కాపులకు 2000 కోట్లు కాపు సంక్షేమానికి ఇస్తాను, అదేవిధంగా వారి పిల్లల తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు అన్నారు. ఈ సందర్భంగా వివిధ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో బానిసలుగా పాలేరులుగా ఎక్కడో ఏ మూలో కూర్చొని చిన్న చిన్న పదవుల కోసం ఒక జాతిని తాకట్టు పెట్టే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రంలో ఉన్న యువతరం బాగుండాలి జనసేన పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్ళడంలో మరి కాపు సోదరులు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.