జిల్లాలో వైకాపా చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: చిత్తూరు జనసేన డిమాండ్

  • హెలికాప్టర్ సీఎంకు వినతి ఇవ్వాలంటే మేమూ హెలికాప్టర్లు కొనాలేమో
  • సీఎం వస్తే ఆ ప్రాంతంలో ఇక స్కూల్స్ కి సెలవే
  • పవన్ బర్త్ డే నుంచి ఫ్లెక్సీలు బందు చేశారు. క్లాత్ ఫ్లెక్సీలే పాటించాలన్నారు. కానీ జగన్ సభలో మొత్తం ప్లాస్టిక్ ఫ్లెక్సీలే
  • తిరుమలకు రానున్న సీఎం ఈసారి వినతిపత్రం తీసుకోకుంటే అడ్డుకుంటాం

చిత్తూరు, తిరుపతి, జిల్లాలో 13 మంది వైకాపా ఎమ్మెల్యేలు ఉండి కూడా కుప్పంకు విచ్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి వారి నియోజకవర్గాలలోని సమస్యలు చెప్పుకోలేని దుస్థితి దాపురించిందని, జనసేన పార్టీగా ప్రజా సమస్యలపై వినతిపత్రాన్ని సీఎం జగన్ కు అందిద్దామని హెలికాప్టర్లో తిరిగే సీఎం జనసేన పార్టీకి భయపడి తప్పించుకు తిరుగుతున్నాడని, మీడియా ద్వారా అధికారులు మా వినతిపత్రాన్ని స్వీకరించటం సిగ్గుచేటని, ఈసారి తిరుమల బ్రహ్మోత్సవాలకు రెండు రోజుల్లో విచ్చేస్తున్న సీఎం జగన్ తమ వినతి పత్రాన్ని స్వీకరించకుంటే ముఖ్యమంత్రిని అడ్డుకోవడం ఖాయమని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్, డాక్టర్ పొన్నా యుగంధర్, డాక్టర్ వెంకటరమణ, దినేష్, తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, జిల్లా కార్యదర్శి కీర్తన, జిల్లా నాయకులు ఆనంద్, బాటసారి మరియు వీరమహిళలు నవ్య, విజయరెడ్డిలు హెచ్చరించారు. జిల్లాలో టమేటా, మామిడి రైతులు జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాల సిండికేట్ వలలు చిక్కుకొని అల్లాడుతున్నారన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని ప్రశ్నించినందుకు విద్యార్థులను అరెస్ట్ చేయడం, సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మొండిచేయి చూపించారన్నారని, హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తిచేయలేని పరిస్థితని, కుప్పంలో గ్రానైట్ దందా కొనసాగుతుందని, ఇలాంటి ఎన్నో సమస్యలపై 13 నియోజకవర్గాలకు సంబంధించి శ్వేతపత్రంను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ హెలికాప్టర్లో తిరిగే సీఎంకు వినతిపత్రం సమర్పించాలంటే తాము హెలికాప్టర్ కొనాలేమోనని ఎద్దేవా చేశారు. స్కూటర్కు పెట్రోల్ పట్టుకోలేని స్థితిలో జనం ఉంటే హెలికాప్టర్ లో తిరిగి సీఎంను ఎలా కలవగలరని విమర్శించారు. మంత్రి రోజా నగిరి అభివృద్ధిపై సవాల్ విసిరి, తప్పించుకు తిరుగుతోందని, ఈసారైనా రోజా తిరుపతిలో బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తే తాము సిద్ధంగా ఉన్నామని, రోజా మూడు సంవత్సరాల్లో ఆమె ఆస్తులు, ఇన్కమ్ టాక్స్ వివరాలు సంబంధిత ఎన్నో వాటిని బయట పెడతామన్నారు. సీఎం జగన్ వస్తే ఆ జిల్లా మొత్తం పాఠశాలలకు సెలవు ఇవ్వాల్సిందేనని ఎందుకంటే బడి బస్సులను సభలకు తరలించడం పరిపాటి అయ్యిందని ఇలా పిల్లల చదువులకు కూడా ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.