ఆప్ సబ్ కి ఆవాజ్ సంస్థ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

వైజాగ్: విదేశాలలో ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడి తాను పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనే తలంపుతో అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రజలకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించాలనే తలంపుతో శివ వడ్లమాని ఏర్పాటు చేసిన ఆస్కా(ఆప్ సబ్ కి ఆవాజ్) స్వచ్చంద సంస్థ విశాఖలో ఓ ప్రైవేట్ హోటల్ లో స్థానిక ప్రజా ప్రతినిధులందరితో కలిసి ఓ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రామనికి ముఖ్య అతిధిగా రిటైర్డ్ రియర్ అడ్మిరల్ శ్రీనివాస్ రత్నం, పల్సస్ సీఈఓ శ్రీనివాస్ గేదెల, జివిఎంసి స్టాండింగ్ కౌన్సిల్ ఆంబుడ్స్ మన్ దొరబాబు, శ్రీ విశ్వ కాలేజ్ చైర్మన్ ధర్మరాజు హాజరై ఆప్ సబ్ కి ఆవాజ్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజా కార్యక్రమాలు వ్యక్తిగత విషయాలలో కూడా గత కొంతకాలంగా ప్రజా ఉపయోగార్థం చేపట్టిన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో సంస్థ చేపట్టబోయే కార్యక్రమాలను సంస్థ చైర్మన్ శివ వడ్లమాని వివరించారు. పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహించామని రానున్న రోజుల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో మారుమూల ప్రాంతాల నుంచి క్రికెట్ పై మక్కువ ఉన్న వారిని వైజాగ్ వారియర్స్ పేరుతో ఏర్పాటు చేసిన టీమ్ ద్వారా క్రికెట్ టోర్నీ నిర్వహించి వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. రిటైర్డ్ రియల్ అడ్మిరల్ శ్రీనివాస్ రత్నం మాట్లాడుతూ సంస్థ తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయమని, ఆదర్శనీయమని తాను పుట్టిన గడ్డకు ఏదో చేయాలని తలంపు రావడం అభినందనీయమని సంస్థ ప్రతినిధులను కొనియాడారు. తాను ఎదగడం, తనతోపాటు సమాజంలో ఉన్న వారిని కూడా ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లాలని ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుందని అటువంటి ఆలోచన కోసం పుట్టిన ఆప్ సబ్ కి ఆవాజ్ సంస్థ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అందుకు తాను కూడా ఈ సంస్థలో భాగస్వామ్యం అయ్యానని తెలిపారు. స్థానిక జివిఎంసి కార్పొరేటర్లు సంస్థ ప్రతినిధులు హాజరై ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, సంస్థ సెక్రటరీ కిరణ్ కుమార్ భావిశెట్టి, ప్రతినిధులు సాయి, సుబ్బు, రాఘవ్ శ్రీనివాస్, భాస్కర్ కొండేటి, భార్గవ్, వంశి, రవి తేజ, పోలిశెట్టి సూర్యప్రకాష్ తదితరులు హాజరయ్యారు.