క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్స్ రివ్యూ మీటింగ్

రాజానగరం: జనసేన పార్టీ ఆదేశాల మేరకు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనలు మేరకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్స్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఈసారి కొన్ని క్రియాశీలక సంబంధిత యాప్ లో టెక్నికల్ గా కొన్ని చేంజెస్ జరిగాయి వాటిని వివరించిన ఐటి కో-ఆర్డినేటర్ రామకృష్ణ గత సంవత్సరంలో మన నియోజకవర్గం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు 5వేల పైగా అందరి సమిష్ఠ కృషితో చెయ్యటం జరిగింది. అలానే ఈ ఈ సంవత్సరం కూడా మరింత ఉత్సాహంతో జనసేన పార్టీ బలం పెరిగినందున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కన్నా మన రాజానగరం నియోజవర్గం మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ అధిష్టానం ఆదేశాల మేరకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో రాజానగరం నియోజకవర్గం ఐటి కో-ఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళలు కందికట్ల అరుణ, కామిశెట్టి హిమశ్రీ, కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, సీతానగరం మండల కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండలం కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, రాజానగరం మండల ప్రధాన కార్యదర్శి కవల శ్రీరామ్, బాపిరాజు, అడబాల హరి, తెలగఒరెడ్డి దుర్గా ప్రసాద్, మెడిద వీరబాబు, కోరుకొండ మండలం గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పోసిబాబు, కోలా జాన్ ప్రసాద్, సంయుక్త పెమ్మాడు సతీష్, సోడాసాని శివాజీ, డేగల హరిచంద్ర ప్రసాద్, డేగల మహంకాళి రాజు, పెరుగు బాబి, తన్నీరు నాగేంద్ర, చల్లా ప్రసాద్, నరకుల దివాకర్, రామాశెట్టి రాజా, బోనగిరి జగదీశ్, అప్పలకొండ, చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తాతాజీ, మండపాక మురళి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.