‘అమ్మ ఒడి’కి అన్నీ అడ్డంకులే: గుత్తి మహిత్

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలలో ఒకటి అమ్మఒడి పథకం. 2021-22 సంవత్సరానికి గాను జనవరిలో అమ్మఒడి పథకానికి సంబంధించిన సొమ్ము అమ్మల ఖాతాలలో పడలేదు. దీనికి ప్రభుత్వం కొత్త నిబంధన షరతులను తెరపైకి తెచ్చింది. ఈ సందర్భంగా జనసేన విద్యార్థి విభాగం నాయకులు గుత్తి మహిత్ మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ‘అమ్మ ఒడి’ పథకం నుండి లబ్ధిదారులకు ఒక్క నయాపైసా కూడా ఇవ్వకుండా ఎగ్గోట్టారు. లబ్ధిదారులు ప్రశ్నిస్తే జులై లో ఇస్తాం అని చెబుతా, డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలా అని జగన్ ప్రభుత్వం ఇప్పడి నుండి ఆలోచనలు మొదలుపెట్టారు. అందులో భాగంగా విద్యుత్ వాడకం 300 దాటితే పథకం కట్ అని చెప్పారు, వేసవిలో విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుంది. అది కాక ఆధార్ కార్డులో కొత్త జిల్లా పేర్లు ఉండాలని, లబ్ధిదారులు, తల్లి ఒకే హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉండాలని ఇలా అనేక అంక్షలు పెడుతూ.. వారిని ఎండల్లో ఆఫీస్ ల చుట్టూ.. తిప్పుతూ చాలా మేరకు కోత పెట్టాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఈ విధంగా ఇన్ని ఆంక్షలు విదిస్తుందని అన్నారు. పథకం మొదట నుండి కూడా ప్రభుత్వం మాట మారుస్తూనే ఉంది. ఇంట్లో ఇద్దరి బిడ్డలకు చదువుకు డబ్బులు వేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఒక్కరికి మాత్రమే అని మాట మార్చడమే కాకుండా.. ఇప్పుడు 2021-2022 విద్యా సంవత్సరానికి అసలు నిధులు మంజురు చేయక పోవడం ఏమిటని, ఇప్పుడు ఇలా ఉంటే 2022-2023 విద్యా సంవత్సరంకి అమ్మఒడి ని పూర్తిగా దూరం చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది, అదే జరిగితే నవరత్నాలలో ఒక రత్నం రాలిపోవడం ఖాయం అని ప్రజలు గ్రహిస్తున్నారు అని జనసేన విద్యార్థి విభాగం జిల్లా నాయకులు గుత్తి మహిత్ ఏద్దేవా చేశారు.