జివిఎంసి ఎదురుగా జనసేన ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్ష

విశాఖపట్నం, బాలి గౌరీ నాయుడు అధ్వర్యంలో జనసేన పార్టీ తరుపున జివిఎంసి ఎదురుగా నిరుద్యోగ దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నిరుద్యోగుల నుండి మంచి స్పందన వచ్చిందని, పార్టీ రోజు రోజుకి బలపడుతుందని, దీన్ని మరింత బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.