నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జనసేన కుటుంబానికి విధేయుడనై ఉంటా: ఎస్.వి.బాబు

పెడన, అక్రమ అరెస్టులను చేసిన నాకు అండగా నిలిచిన జనసేన పార్టీ నాయకులకు మరియు జనసైనికులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెడన పట్టణానికి వచ్చిన విషయం విధితమే. బటన్ నొక్కి నేతన్న నేస్తం లబ్ధిదారులకు సహాయం అందించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెడన నియోజకవర్గంలోని చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉంది. కార్మికులు పని లేక ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారు. చేనేత కార్మికుల సమస్యలపై నేను వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా వైసిపి పార్టీ పోలీసుల సహకారంతో అక్రమ అరెస్టు చేసి మధ్యాహ్నం 3 గంటలకు నిర్బంధించటం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున వచ్చి నాకు సంఘీభావం తెలియజేసి, పోలీసుల అక్రమ అరెస్టులు ఖండించడం జరిగింది. ఎవరికీ తెలియని సముద్ర తీర ప్రాంతంలో నన్ను నిర్బంధించారు. మన జన సైనికులు జనసేన పార్టీ నాయకులు ఎంతో శాఖసఖ్యంగా వ్యవహరించి నేను ఉన్న ప్రదేశాన్ని ట్రేస్ అవుట్ చేసి, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ప్రదేశంలో (కనీసం కూర్చోవడానికి కూడా వసతులు లేని) నా కోసం నిరీక్షించిన నా జనసేన కుటుంబ సభ్యులకు పాదాభివందనాలు చేస్తున్నాం. చేతులెత్తి నమస్కరిస్తున్నానని, నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీకి మీ అందరికీ విధేయుడనై ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని పెడన జనసేన నాయకులు ఎస్.వి.బాబు అన్నారు.