కుటమి నాయకులే లక్ష్యంగా అరాచక మూకల దాడులు
- ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి
- చిలకలూరిపేట బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి
- జనసేన సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట: ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాయుత పరిస్థితులు నెలకొనడం, విధ్వంసకర సంఘటన సంఘటనలు చెలరేగటం, కూటమికి చెందిన వ్యక్తులు గాయపడటం అత్యంత బాధాకరమని జనసేన సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్, ఉంగుటూరు నియోజకవర్గ పరిశీలకులు పెంటేల బాలాజి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా వైసీపీ రాక్షస మూకల రక్తదాహం తీరలేదన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారని వివరించారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి: కూటమి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారని వెల్లడించారు. వైసీసీ నాయకులకు కొంతమంది అధికారులు, పోలీసులు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే ఏ ప్రాంతాల్లో గొడవలకు కారణమౌతాయన్న విషయాన్ని గుర్తించి, ఆ పోలింగ్ కేంద్రాలు, గ్రామల పరిధిలో ప్రత్యేక బలగాలు దించటం, ఇతర ముందస్తు చర్యలు తీసుకుంటారని వివరించారు.కాని ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ఇందుకు భిన్నంగా ఉందన్నారు. వివాదాలు, ఘర్షణలను అదుపు చేయలేక పోయారని, అనేక ప్రాంతాలలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసిన వారికి రక్షణ కరువైందన్నారు. వైసీసీ మూకలు రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఐదేళ్ల హింసా రాజకీయాలకు ప్రజలు సోమవారమే స్వస్తి పలికారని,. జూన్ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యాక రెట్టింపు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాడులకు పాల్పడ్డ వారిపై ఎన్నికల సంఘం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి: చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై బాలాజి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమదంలో ఆరుగురు మృతి చెండటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.