జనసేన పార్టీ కి సంఘీభావం తెలిపిన బైలుకించంగి గ్రామస్తులు

అల్లూరిసీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బైలుకించంగి గ్రామంలో జనసేన పార్టీ పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా వంపూరు గంగులయ్య పిలుపు మేరకు చింతపల్లి మండల నాయకులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామస్తులనుద్దేశించి డా గంగులయ్య మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన మన పూర్వీకులు చూసారు. బ్రిటిష్ వారి కాలంలో ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద తేడా ఏమీ లేదు మన నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కనీసం 5% అయిన న్యాయం చేస్తే సంతోషించేవాళ్ళం కానీ జీవో నెం 3 కోల్పోయాం, 5వ షెడ్యూల్ ప్రాంతం అధికరణాలు, హక్కులు, చట్టాలు కోల్పోతున్నాం. గిరిజన ప్రతితినిధులుగా కనీసం తమవంతు వాదన అసెంబ్లీలో, పార్లమెంట్ లో వినిపించిన పాపాన పోలేదు అలాంటి ప్రజా ప్రతినిధులను ఎంచుకున్న గిరిజన ప్రజలు తమకు తెలియకుండానే తమజాతి ప్రయోజన అస్తిత్వం కబళించే ఒక మూర్ఖపు రాజకీయపార్టీకి అధికారం కట్టబెట్టారు కానీ ప్రస్తుతం యువత ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా యువత చేతుల్లో రాజ్యాధికారం అందించే ఆలోచన చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ పై వారి నాయకత్వం రాష్ట్ర యువత అశలు పెట్టుకుంది. ఇది మార్పుకి గొప్ప ముందడుగు అధికారానికి ముందు గంపెడు హామిలిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఆలోచన ధోరణి మరల్చడానికి చెయ్యాల్సిన కుయుక్తులన్ని చేస్తుంది కాబట్టి ఈ సందర్బంగా నా గిరిజన జాతి ప్రజలందరికీ విన్నవిస్తున్నాం ఏ విలువలులేని రాజకీయశక్తిని మూర్ఖంగా నమ్ముతామో ఆ రాజకీయశక్తి గిరిజనుల పాలిట శత్రువయ్యింది ఇప్పటికైనా ప్రజలు మేలుకోవలని జనసేనాని ఒక అవకాశం ఇవ్వాలని నిజాయితీ తో ఓటు హక్కుని ప్రజాస్వామ్యయుతంగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామస్తులు డా వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో కండువాలు వేసుకుని జనసేన పార్టీ కి సంఘీభావం తెలిపారు రానున్న ఎన్నికల్లో మా శక్తి ఏమిటో పాలక ప్రభుత్వానికి చూపుతామని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్బంగా ఈ సమావేశం ఏర్పాటుచేసిన చింతపల్లి మండల నాయకులు రవి, బుజ్జిబాబు, శెట్టి స్వామి, కృష్ణమూర్తి, శ్రీను తదితర జనసైనికులని డా వంపురు గంగులయ్య అభినందిస్తూ పెద్దఎత్తున పాల్గొన్న గ్రామ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు.