వంగా వీరబాబు కుటుంబానికి 46 వేల రూపాయలను అందించిన బండారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలోని ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన వంగా వీరబాబు కుటుంబ సభ్యులను, జనసేన ప్రముఖ నాయకులు బండారు శ్రీనివాస్ నాయకత్వంలో పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు 46 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేసి, తమ మానవత్వాన్ని గొప్పగా చాటుకున్నారు. జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ… ఎదుటి వ్యక్తులు, కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడమే జనసేన పార్టీ సిద్ధాంతమని, జనసేనాని పవన్ కళ్యాణ్ వారి గొప్ప ఆశయమని, వారి అడుగుజాడల్లో నియోజకవర్గ ఇన్చార్జిలుగా మేమంతా, జిల్లా కార్యదర్శులు, జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు నిరంతరం నాకు వెన్నంటే ఉంటూ, నన్ను ముందుకు నడిపిస్తున్న నా జనసేన కుటుంబానికి, నాకు తోడుగా నా వెంట నడుస్తున్న గ్రామ, మండల నాయకులకు, కార్యకర్తలకు మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయుచున్నానని అన్నారు. నిజాయితీగల జనసేనాని లాంటి గొప్ప వ్యక్తి యొక్క నాయకుడి నాయకత్వం రేపు రాబోయే రోజుల్లో, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి జనసేనాని ఎంతో ఉపయోగమని, ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు మారాలంటే జనసేనానిని రేపు రాబోయే రోజుల్లో కచ్చితంగా గెలిపించాలని, గెలుస్తారని, జనసేనాని పవన్ కళ్యాణ్ వారు ఏ ఒక్క కుల నాయకుడు కాదని, అన్ని వర్గాల వారికి అండగా నిలబడే ఆపద్బాంధవుడు అని, ఒక్కసారి అధికారంలోకి జనసేనాని రావాలని, ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వానపల్లి గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు కొత్తపేట మండల జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.