రెబల్ స్టార్ కృష్ణంరాజుకి నివాళులు అర్పించిన బండారు శ్రీనివాస్

కొత్తపేట, తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్ గా పేరు గడించిన గొప్ప నటులు, పార్లమెంట్ సభ్యునిగా రెండు పర్యాయాలు సేవలు అందించిన వ్యక్తి కృష్ణంరాజు మరణవార్త బాధాకరమని కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజుకు నివాళులర్పించారు. బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణంరాజు విలక్షణ నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారని అలాగే పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. మంచి వ్యక్తిని, సినీ పరిశ్రమకు అద్భుత నటుడిని కోల్పోయిందని బండారు శ్రీనివాస్ అన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.