జనసేన పార్టీలో బారీ చేరికలు

  • చిన వాకపల్లిని ఆదర్శంగా తీసుకున్న పెద వాకపల్లి

అల్లూరి సీతారామారాజు జిల్లా, జి.మాడుగుల మండలం, నుర్మాతి పంచాయితీ, పెద వాకపల్లిలో సోమవారం జి.మాడుగుల మండల జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన జనసేన పార్టీ చేరికల సమావేశంలో ముఖ్య అతిధిగా పాడేరు జనసేన పార్టీ, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య హాజరయ్యారు. చిన వాకపల్లి గ్రామస్తులందరు గత ఏడాదిలో మూకుమ్మడిగా జనసేన పార్టీలో చేరడం అందరికీ తెలిసిన విషయమే. ఆ గ్రామస్తులను ఆదర్శంగా తీసుకుని సోమవారం పెద వాకపల్లి గ్రామస్తులందరు జనసేన పార్టీలోకి చేరారు. వారిని స్వయంగా వంపూరు గంగులయ్య కండువాలు కప్పి గ్రామస్తులందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో గ్రామస్తులు, మహిళలు మాట్లాడుతూ గతంలో పాలించిన ఏ ప్రభుత్వాలు కూడా మాకు సహాయం చేయలేదని, మా ఆత్మగౌరవాన్నీ కేవలం రాజకీయలబ్ధికోసమే ఉపయోగించుకున్న పార్టీలు చూసేసామని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారధ్యాన్ని నమ్ముతున్నామని, మన ప్రాంతంలో ఆదివాసీ హక్కులు, చట్టాలగురించి తెలిసిన నేతగా గంగులయ్యను నమ్ముతున్నామని.. అందుకే పార్టీలోకి చేరుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డా.. వంపూరు గంగులయ్య మాట్లాడుతూ మీరందరు నేడు జనసేన పార్టీ లోకి చేరడం ఎంతో సంతోషించాల్సిన విషయం. గతంలో ఈ గ్రామంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగిందని, న్యాయం కోసం పోరాడిన వ్యక్తుల్లో మేము కూడా ఒకరని ఆదివాసీ ఆత్మగౌరవానికి ఈ ప్రభుత్వాలు ఇచ్చే గౌరవము ఎలాంటిదో మీరు నేను ఈ భారతదేశం మొత్తం చూసిందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావించి రాజకీయలబ్దిని ఆశించడం వంటి నీతిలేని పనులు జనసేన పార్టీ చెయ్యదు.. మీ తరుపున ప్రశ్నించడానికి న్యాయం జరిగేలా మా వంతుగా ఎల్లవేళలా పోరాడుతము అనగారిన వర్గాల అభ్యున్నతి, ఆత్మగౌరవం ఈ ప్రభుత్వాలకు పట్టదు. మీ అందరి ఆశీర్వాదాలు ఫలించి చట్టసభల్లో మేము అడుగుపెడితే మన అభివృద్ధి మన సమస్యలు, మనహక్కులు, చట్టాలు, మన సంస్కృతి మన ఆత్మగౌరవానికి బంగాకలిగే ఎటువంటి దుశ్చర్యలైన ఉపేక్షించేది లేదని, మేము మాత్రం రాజకీయాలకు అతీతంగా పోరాడతామని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రశ్నించే తత్వం వాకపల్లి యువత తీసుకోవాలని.. చట్టసభల్లో మన ఆదివాసీల వైపు పోరాడే నాయకులకు అండగా ఉండాలని గతంలో ఎన్నో ఆదివాసీ పోరటాలు చేసిన నేతగా గంగులయ్యను గుర్తించి జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ రాజకీయ విలువలు నచ్చి జనసేన పార్టీ లోకి చేరమని కొర్ర భానుప్రసాద్ తన మాతృభాషలో పెద వాకపల్లి గ్రామస్తులకు తెలియజేసారు. ఈ సమావేశం అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన జి.మాడుగుల మండల నాయకులు మసాడి భీమన్న మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ ప్రభంజనం చూపుతుందని అందుకు నిదర్శనమే ఈ రోజు ఏ గ్రామానికి అడుగుపెట్టిన ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు. మసాడి సింహాచలం మాట్లాడుతూ యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిందేనని అందుకు అధినేత పవన్ కళ్యాణ్ యువతకు దిశానిర్దేశం అనుక్షణం చేస్తూనే ఉన్నారన్నారు. గౌరవ అధ్యక్షులు జిమడుగుల టి.వి రమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయని, ప్రజలు మార్పుకోరుకుంటున్నారని తెలిపారు. 2007లో జరిగిన నాటి దురదృష్టకర సంఘటన తలుచుకుని మహిళలు అప్పట్లో 11 మంది వుండేవాళ్ళమని, మాలో ఇద్దరు మహిళలు మానసిక వ్యధతో చనిపోయారని నాటి విషయాలు వంపురు గంగులయ్యగారితో చెప్పుకుంటు కన్నీరు మున్నీరౌతు పెద్దఎత్తున గ్రామస్తులు, యువత, మహిళలు జనసేన పార్టీలో చేరి నాటి విషయాలు వినతిపత్రం రూపంలో గంగులయ్యకు అందించారు. ఈ సమావేశానికి జి.మాడుగుల మండల అధ్యక్షులుమసాడి భీమన్న, కొర్ర భానుప్రసాద్, మసాడి సింహాచలం, టి.వి రమణ, సోమన్న, నాగేశ్వరరావు, సూరిబాబు, పాడేరు మండల ఉపాధ్యక్షులు సీసాలి భూపాల్, అశోక్ కిల్లో, అశోక్ సాలేబు, సంతోష్ మజ్జి, తదితరులు పాల్గొన్నారు.