స్కూల్ పిల్లలకు ప్లేట్లను బహుమతిగా ఇచ్చిన భీమవరం జనసేన

భీమవరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం స్కూల్ పిల్లలకు ప్లేట్లను బహుమతిగా సమర్పించడం జరిగినది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క భీమవరం జనసైనికుడికి మా హృదయ పూర్వక ధన్యవాదములని, 51 వ పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.