జనసేన ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డేపల్లి రాజగోపాల్ రావు శత జయంతి వేడుకలు

ఆమదాలవలస నియోజకవర్గం: స్వర్గీయ శ్రీ బొడ్డేపల్లి రాజగోపాల్ రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు మరియు ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, కౌముది విద్య సంస్థల అధినేత, రిటైర్డ్ ఆర్.జె.డి పాత్రుని పాపారావు పాల్గొన్నార., ఈ సందర్భంగా బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ.. శ్రీ రాజగోపాల్ రావు గారు ఈ జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చారు. రైతులకు సాగునీరు అందించారని కోనియాడారు. బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ ఈ జిల్లా ఖ్యాతిని మరియు విశిష్టతను ఢిల్లీలో లెవెల్ లో తీసుకువచ్చినటువంటి మహనీయడు అని కాళింగ సామాజిక వర్గాన్ని బి.సి.ఏ లో పెట్టినటువంటి మహనీయులని పేర్కొన్నారు. పాత్రుని పాపారావు మాట్లాడుతూ.. ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఇండిపెండెంట్ పోటీ చేసి అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచి కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు పార్టీలో చేరి వరుసగా ఆరు సార్లు గెలిచిన ఘనత ఆయనదని తెలిపారు. పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో బోడ్డేపల్లి రాజగోపాల్ రావు లాంటి వారు పుట్టడం శ్రీకాకుళం జిల్లాకి చేసుకున్న అదృష్టమని, జిల్లాకు గొట్ట బ్యారేజ్ తీసుకొచ్చి ఎడమ కాలువ ద్వారా కొన్ని లక్షల మంది రైతులకు ఆశాజ్యోతిగా నిలిచారని, కొన్ని వేలమంది కార్మికులకు షుగర్ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి కల్పించినటువంటి ఘనత ఆయనకే చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కళింగ కమ్యూనిటీ పెద్దలు, ఇచ్చాపురం ఇంచార్జ్ దాసరి రాజు, శ్రీకాకుళం ఇంచార్జ్ కోరాడ సర్వేశ్వరరావు, టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్, చింతాడ రామ్మోహన్, సనపల అన్నాజీ, పైడి సాంబమూర్తి, పేడాడ వైకుంఠ రావు, గుంట లక్ష్మణరావు, డాక్టర్ పొట్నూరు సూర్యం, చెల్లయ్య, తిప్పన్ దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వర్ రావు, గర్భాన సత్తిబాబు, గురు ప్రసాద్, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.