జనసేన పార్టీకి లక్షరూపాయల విరాళం అందజేసిన బొలియశెట్టి శ్రీకాంత్
జనసేన పార్టీ, మంగళగిరి పార్టీ కార్యాలయంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ విజయదుర్గ దంపతులు, కుమార్తె ఆక్షయ, కుమారుడు లోకేష్ జనసేన పార్టీకి 1లక్ష రూపాయలు (1,00,000/-) విరాళం అందజేశారు. పీఏసీ ఛైర్మన్ మనోహర్ మాట్లాడుతూ.. మైలవరం నియోజకవర్గం, కొండపల్లి మున్సిపాలిటీ నందు నివసించే బొలియశెట్టి శ్రీకాంత్ దంపతులు పార్టీకి విరాళం ఇవ్వడం చాలా ఆనందంగా వుంది.. 2014 లో పార్టీ పెట్టినప్పటి నుండీ పార్టీ కోసం కష్టపడుతున్నారు.. అలాగే జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ నాలుగు నియోజక వర్గాలలో ఉన్న మండల కమిటీల బాధ్యతలు కూడా సక్రమంగా ముందుకు తీసుకొని వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. జనసేనపార్టీ ని ఇంతగా ప్రేమించే వాళ్ళు వుండం జనసేనపార్టీ అదృష్టం అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీ కుమారి మరియు అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు.