అవనిగడ్డ నుండి పవన్ కళ్యాణ్ కు భద్రతగా బౌన్సర్లు సిద్ధం: శేషుబాబు

విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే జనవాణి కార్యక్రమం అడ్డుకోవడం, హోటల్లో పోలీసుల చేత నిర్బంధించడం, ర్యాలీలో కావాలని రెచ్చగొట్టడం, తదుపరి హైదరాబాదులోని పవన్ కళ్యాణ్ నివాసం ఉండే ఇల్లు మరియు పార్టీ కార్యాలయం వద్ద కొంతమంది వ్యక్తులు రెక్కీ నిర్వహించడం, 250 కోట్ల సుఫారి తీసుకుని పవన్ కళ్యాణ్ ని అంతమొందించాలని కుట్ర చేయటం లాంటి అనేక సంఘటనలు రాష్ట్రంలో జరుగుతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు నోరు విప్పకపోవడం, పవన్ కళ్యాణ్ కి భద్రత పెంచే విషయం పరిశీలించకపోవడం దురదృష్టకరమని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సొంత తల్లి, చెల్లెలు పక్క రాష్ట్రాలకు వలస పోవడం, బాబాయి కూతురు వైయస్ సునీత న్యాయం కోసం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం, బాబాయి హత్యతో సీఎం కుటుంబానికి చెందిన బంధువుల పాత్ర ఉందని విచారణలో తెలియడం చూస్తుంటే హత్యా రాజకీయాలతో ముడిపడి ఉన్న కుటుంబానికి చెందిన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కి రక్షణ కల్పిస్తాడు అనుకోవడం హాస్యాస్పదమే అవుతుందని, కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే కలుగజేసుకుని పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డ మండల జనసైనికులు స్థానిక సీతాయలంక వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మోకాళ్లపై కూర్చుని, నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించిన వారిని గుర్తించి, అరెస్టు చేసి, కఠిన శిక్షలు విధించాలని ఈ సందర్భంగా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కు రక్షణగా ఉండటానికి అవనిగడ్డ నుండి 50 మంది బౌన్సర్ లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని శేషుబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, జిల్లా పార్టీ కార్యదర్శి గాజుల శంకర్రావు, ఎంపీటీసీ బొప్పన భాను, ఎంపీటీసీ కటికల వసంత్, అశ్వరావు పాలెం గ్రామ ఉపసర్పంచ్ యక్కటి నాగరాజు, అవనిగడ్డ గ్రామ వార్డు మెంబర్ మునిపల్లి శ్రీలక్ష్మి, రామకోటిపురం వార్డు మెంబర్ మత్తి శివ పార్వతి, బండే నాగ మల్లీశ్వరి, బచ్చు కృష్ణ కుమారి, రామచంద్రాపురం వార్డు మెంబర్ కమ్మిలి సాయి భార్గవ, బచ్చు రఘునాథ్, కైతేపల్లి రాజేష్, చెన్ను వాల్మీకి, బచ్చు శ్రీను, బచ్చు శ్రీహరి, రేపల్లె రంగనాథ్, దాసినేని నాగరాజు, తుంగల నరేష్, కోసూరి అవినాష్, రేపల్లె రోహిత్, అప్పికట్ల శ్రీ భాస్కర్, గరికిపాటి శ్రీనివాస్, బచ్చు మురళి, భోగిరెడ్డి నాగేశ్వరరావు, మత్తి శ్రీను, తుంగల వేణు, గిరీష్, మండలి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.