శివకుమార్ కు మనోధైర్యాన్నిచ్చిన చంద్రగిరి జనసేన

చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలంలోని మంగినాయనపల్లి గ్రామంలో ఎన్.శివకుమార్ అనే ఒక వ్యక్తి ఈ మధ్య చెట్టుపై నుండి పడి గాయపడటం జరిగింది. వారి కుటుంబాన్ని మంగళవారం జనసేన పార్టీ తరపున సందర్శించి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీ తరపున 8000 రూపాయలు ఆర్థిక సహాయం (డిఎంసి హెల్పింగ్ హ్యాండ్స్ తరపున 5000, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి 2000, పాకాల మండల ఉపాధ్యక్షులు బి.దినేష్ 1000)అందించి భరోసా ఇచ్చి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి, పాకాల మండల ఉపాధ్యక్షులు బి.దినేష్, ఐరాల మండల ప్రధాన కార్యదర్శి వాసు రాయల్, జనసేన నాయకులు చాంద్ బాషా, మస్తాన్, పాకాల మండల కార్యదర్సులు భాను, రూపేష్ మరియు నాగేంద్ర, విజయ్, అసిఫ్, మస్తాన్ పాల్గొన్నారు.