అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి చిలకలూరిపేట జనసేన భరోసా

  • బొంత రామయ్య కుటుంబానికి పది వేల రూపాయల నిత్యావసర వస్తువులు, సరుకులు అందజేసిన చిలకలూరిపేట జనసేన.

చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామం, మాదిగపల్లి, పెద్దబడి సెంటర్ వద్ద బొంత రామయ్య కుటుంబం గత 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. రామయ్యకు భార్య సుభాషిని వారి కుమార్తెలు అపర్ణ, స్వప్న, కుమారుడు విజయ్ కుమార్ ఉన్నారు. 21వ తారీకు అర్ధరాత్రి 12:30 గంటలకు వారు నివాసం ఉంటున్న గృహం కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదానికి గురయింది. ఈ అగ్ని ప్రమాదంలో రామయ్య కుటుంబం గృహంలో ఉన్నటువంటి నిత్యవసర వస్తువులు, సరుకులు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితర సామాగ్రి మొత్తం అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహుతి అవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి తోట రాజా రమేష్, చిలకలూరిపేట మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ భాషా, పట్టణ నాయకులు మునీర్ హసన్, పోలుకులూరి స్టీల్ అంజి, లీలా కిషోర్ లు వెంటనే మానవతా దృక్పథంతో బొంత రామయ్య కుటుంబ సభ్యులకు 10,000 వేల రూపాయల నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులు రామయ్య కుటుంబానికి జనసేన పార్టీ తరఫునుంచి అందజేశారు. ఈ సందర్భంగా తోట రాజా రమేష్ మాట్లాడుతూ రామయ్య గృహం ఈ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికి ఆహుతి అవటం చాలా బాధాకరం అని అన్నారు. వీరికి భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా జనసేన పార్టీ ముందుంటుందని రాజా రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మల్ల కోటి, పగడాల వెంకటేశ్వర్లు, అచ్చు కోల అరుణ్, రామారావు, ప్రభాకర్, సాంబయ్య, వేలూరు గ్రామ జనసేన పార్టీ నాయకులు వంజా రాజేష్, బొల్లాపల్లి నరేంద్ర, చౌటుపల్లి ఆశీర్వాదం, చౌటుపల్లి చిన్న ఆశీర్వాదం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.