వేమూరు జనసేన ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు

వేమూరు, మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా వేమూరు నియోజకవర్గం, పెరవలి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు మెరిట్ విద్యార్థులకి బహుమతులు అందజేయడం జరిగింది. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లోకి రావాలి అని సోమరౌతు అనురాధ సందేశం ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దేశానికి మరింత సేవ చేసే అవకాశం కలగాలని బ్రహ్మం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చావలి ఎంపీటీసీ గాజుల నగేష్, చుండూరు జనసేన ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, అబ్బనగూడవల్లి మురళి, తాడికొండ శివరామకృష్ణ, గణది ఆదిలక్ష్మి, వీరమహిళలు పాల్గొని మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.