కాపు సామాజిక వర్గానికి సీఎం క్షమాపణ చెప్పాలి: చింతా రేణుకారాజు

గుంటూరు: శుక్రవారం జరిగిన కాపు నేస్తం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని గుంటూరు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చింతా రేణుకారాజు దుయ్యబట్టారు… రాష్ట్రంలో అభివృద్ధి అంటే అప్పులు చేసి బటన్ నొక్కడంకాదు అని అన్నారు.. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకొని ప్రజలకు మేలు చేసే పారిశ్రామిక విప్లవం తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలి అని అన్నారు… సిబిఐ దత్తపుత్రుడుకి పరిపాలన చెయ్యడం చేతకాక, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అన్ని గుత్తగా అమ్మేసుకుంటారని అనడం యావత్తు కాపు సామాజికవర్గాన్ని అవమానిచడమే అని అన్నారు… బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సిబిఐ దత్తపుత్రుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు., కాబట్టి వెంటనే కాపు సామాజిక వర్గానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.., ప్రజలలో జనసేనకు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ చూసి సిబిఐ దత్తాపుత్రుడుకి, వారి భజన బ్యాచ్ కు వెన్నులో వణుకు పుడుతుందని, జనసేన అధికారం లోకి వస్తే సిబిఐ దత్తపుత్రుడు శాశ్వతంగా చర్లపల్లి జైల్ కూడు తినాల్సి వస్తుందని, బయపడుతున్నారని అన్నారు., అందుకే జనసేనపైన, అధినేత పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.., రెండు చోట్ల ఓడిపోయిన వాడిని చూసి రోజూ కలలో కూడా కలవరించేలా చేస్తున్నారు అంటేనే అర్థంచేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏవిధంగా భయపడుతున్నారో తెలుస్తుంది.. చివరికి సిబిఐ దత్త పుత్రుడు పాలన చేయడం చేతగాక బటన్ సీఎంగా మాత్రమే మిగిలి పోతాడాని గుంటూరు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చింతా రేణుకారాజు అన్నారు.