మేజర్ మళ్ళ రాంగోపాల్ నాయుడుకి అభినందనలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేజర్ మళ్ళ రాంగోపాల్ నాయుడు గారు ‘కీర్తి చక్ర’ పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశ రక్షణలో అత్యంత ధైర్య సాహసాలతో, విశిష్ట సేవలందిస్తున్న మేజర్ రాంగోపాల్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు. ఆయన దేశ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ దగ్గర ఉగ్రవాదులతో చేసిన పోరాటం అసామాన్యమైనది. ప్రాణాలకు తెగించి గ్రైనేడ్ దాడులను తప్పించుకొని, తన వెంట ఉన్న సైనిక బృందాన్ని రక్షించుకున్న విధానం మేజర్ రాంగోపాల్ నాయుడు గారి పోరాట పటిమను తెలుపుతోంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామానికి చెందిన ఆయన యువతకు స్ఫూర్తిగా నిలుస్తారని శ్రీ పవన్ కళ్యాణ్ కొనియాడారు.