రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చీడపురుగు సీపీఐ నారాయణ

  • ప్రధానమంత్రి మోదీ చిరంజీవిని అభినందిస్తుంటే నిలువెల్లా అసూయతో రగిలిపోయిన నారాయణ
  • పేద ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా వేల కోట్లు సంపాదించిన నారాయణ
  • పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులాంటి వారి స్ఫూర్తిని ధనదాహంతో నిర్వీర్యం చేసిన వ్యక్తి నారాయణ
  • ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల బూట్లు నాకే చరిత్ర నారాయణది
  • చిల్లర వేషాలు వేయటం ఊసరవెల్లికే రంగులు మార్చే విద్య నేర్పించటం నారాయణకు వెన్నతో పెట్టిన విద్య

సీపీఐ నారాయణ పై విరుచుకుపడ్డ జనసేన ఆళ్ళ హరి

పేద బడుగు బలహీన వర్గాల, తాడిత, పీడిత ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా చేసుకొని.. ప్రజా ఉద్యమాలను అడ్డుపెట్టుకొని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కాళ్ళకి చెప్పులా బ్రతుకుతూ సామాన్య స్థాయి నుంచి వేలాది కోట్ల స్థాయికి ఎదిగిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చీడపురుగు లాంటి వాడని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. సోమవారం సీపీఐ నారాయణ అసందర్భంగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆళ్ళ హరి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ చిరంజీవి ఒకే వేదికపై ఉండటంతో పాటూ.. మోదీ సైతం చిరంజీవిని అభినందించటంతో నిలువెల్లా అసూయతో రగిలిపోతూ.. తనువుమొత్తం విషాన్ని నింపుకున్న నారాయణ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించింది ప్రధానమంత్రి కార్యాలయమన్నారు. అసలు కష్టాన్ని నమ్ముకొని స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎదిగిన చిరంజీవిని విమర్శించే అర్హత ప్రజల కష్టాల మీదే బ్రతికే నారాయణకు లేదన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు లాంటి మహానుభావులు నడయాడిన పార్టీలో ఉంటూ వారి స్ఫూర్తిని కూడా తాకట్టు పెట్టి తన ధనదాహంతో పార్టీని, న్యాయం చేస్తారని నమ్మివచ్చిన పీడిత ప్రజల్ని నయవంచన చేసిన ఘనుడు నారాయణ అని దుయ్యబట్టారు. తొలుత ప్రజా ఉద్యమాలను హై స్థాయికి తీసుకువెళ్లటం రాత్రికి రాత్రి అధికార పార్టీతో కోట్ల రూపాయలకు ఆ ఉద్యమాన్ని అమ్మేయటం నారాయణకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఇలా ఎన్నో మహోన్నతమైన ప్రజా ఉద్యమాలను నీరుకార్చి కోట్లకు పడగలెత్తిన ప్రజా ద్రోహి నారాయణ అని అన్నారు. చిరంజీవిని రాజకీయ ఊసరవెల్లి అనటం తగదని.. సిద్దాంతాలు, ప్రజా పోరాటాలకు తిలోదకాలు ఇచ్చి ఆంద్రప్రదేశ్ గడ్డపై పుట్టిన ప్రతీ పార్టీతో అంటకాగిన నారాయణ కంటే పెద్ద రాజకీయ వ్యభిచారి ప్రపంచంలో మరొకరు ఉండరని తీవ్రంగా విమర్శించారు. ఏరోజు ఏమి తినాలో కూడా తెలియని రాజకీయ అజ్ఞాని నారాయణ అని ఆయన మాటలను నిజమైన విలువలతో ప్రజా పోరాటాలు చేస్తున్న సీపీఐ నాయకులు సైతం సహించలేకపోతున్నారని అన్నారు. వామపక్ష పార్టీల్లో పోరాడే వారిని పార్టీనుంచి దూరం చేయటంలోనూ.. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి బూట్లు నాకుతూ పబ్భం గడుపుకోవటంలోనూ నారాయణది అందెవేసిన చెయ్యి అని విమర్శించారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో, ఎవర్ని ఎందుకు పొగుడుతాడో, మరొకరిని ఎందుకు తిడతాడో నారాయణకే తెలియదన్నారు. వయసు రీత్యా కానీ, ప్రజల్ని పీడించుకున్న పాపమో కానీ నారాయణకు మతిభ్రమించి ఉంటుందన్నారు. చివరి రోజుల్లో అయినా ప్రజలకు కాస్త మంచి చేయాలి కానీ ఇంకా దుష్ట రాజకీయాలతో మరింత పాపం కట్టుకోవటం నారాయణకు మంచిది కాదన్నారు. మరోసారి చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని.. సమాధానం ఇంకోరకంగా చెప్పాల్సి ఉంటుందని నారాయణను ఆళ్ళ హరి హెచ్చరించారు.