దళిత, ఆదివాసీలు ఈ పాలకులకు ఓటు బ్యాంకు మాత్రమే

*సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై అధ్యయనం చేస్తాం
*మాలమహానాడు, దళిత, ఆదివాసీ సంఘాల నాయకులకు పవన్ కళ్యాణ్ హామీ

దళిత, ఆదివాసీలను పాలకులు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 29 పథకాలు రద్దు చేసిందని ఆరోపించారు. దేశం మొత్తం అమల్లో ఉన్న సబ్ ప్లాన్ నిధుల్ని ఇతర అవసరాలకు ఎలా వాడుకుంటారని ప్రశ్నించారు. ‘జనవాణి – జనసేన భరోసా’ కార్యక్రమంలో భాగంగా మాల మహానాడు, దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు పవన్ కళ్యాణ్ గారికి తమ సమస్యలు చెప్పుకున్నారు. సబ్ ప్లాన్ నిధులు ప్రభుత్వం దుర్వినియోగం చేసి తమకు అన్యాయం చేస్తోందని తెలిపారు. ఈ విషయం మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ.. మాల మహానాడు, దళిత ఆదివాసీల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తాం. సబ్ ప్లాన్ నిధుల వినియోగం మీద అధ్యయనం చేస్తాం. ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.