మదనపల్లెలో కూటమి నాయకుల భారీ ర్యాలీలో పాల్గొన్న దారం అనిత
మదనపల్లె పట్టణంలో చిత్తూరు బస్టాండ్ నుండి నీరుగట్టువారి పల్లె వరకు జరిగిన ర్యాలీలో మదనపల్లి కూటమి అభ్యర్థి షాజహాన్ బాష, పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడు నిఖిలేష్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీమతి దారం అనిత. ఎన్నికల శంఖారావంలో భాగంగా శనివారం మదనపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ ర్యాలీలో టిడిపి సీనియర్ నాయకులు బాబు రెడ్డి, విద్యా సాగర్, దొరస్వామి నాయుడు, మధు బాబు, నీలకంఠ, సిద్దప్ప, జంషీర్, నాగరాజు, వరుణ్, అరుణ్, ప్రణయ్, పవన్, రెడ్డి కుమార్, మరియు టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.