ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో జనసేనానిపై జగన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన దాసరి రాజు

ఇచ్చాపురం: శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేటలో ఏర్పాటుచేసిన పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్దానంలో కిడ్నీ బాధితుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఇచ్చాపురం జనసేన ఇన్చార్జ్ దాసరి రాజు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దాన కిడ్నీ సమస్య కోసం పత్రికల్లో వార్తలు వచ్చినా ఈ సమస్యపై ఏ నాయకుడు స్పందించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన వెంటనే ఆయన 2017 జనవరి 3వ తేదీన ఇచ్చాపురం వచ్చి కిడ్నీ బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత వెంటనే అప్పటి అధికార ప్రభుత్వంకు డెడ్ లైన్ ఇస్తూ కిడ్నీ బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేసిన దమ్మున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇదే ఉద్ధాన ప్రాంతం బొరివంక సభలో నన్ను గెలిపిస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు.. తీరా అధికారంలోకి వచ్చాక కిడ్నీ వ్యాధిగ్రస్తులు విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అప్పుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా విధుల్లో ఉన్న ధనుంజయ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారునిగా వ్యవహరిస్తున్నారు వారిని సంప్రదిస్తే నాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తరువాత ఈ సమస్యను ఎంతవరకు తీసుకెళ్లారు అని, అప్పట్లో సెంట్రల్ హెల్త్ మినిస్టర్ వచ్చి దీనిపై ఎంక్వయిరీ వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమస్యను పరిష్కరించమని అప్పటి గవర్నమెంట్ కి డెడ్ లైన్ ఇస్తే, నన్ను గెలిపించండి అంటూ అడుక్కున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఏదైతే డయాలసిస్ పేషెంట్స్ కి పదివేల రూపాయిలు ఇస్తా అన్న ప్రభుత్వం ఎంత మందిని ఆదుకుంటుంది. డయాలసిస్ పేషెంట్స్ ఎన్నో వందలమంది వేలు మంది వున్నప్పటికీ కొంతమందికే అది పరిమితమైంది. దీనిలో కూడా ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న వారిని కూడా 10 నుండి 11 వేలు శాలరీ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు డయాలసిస్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి వర్తించనివ్వకుండా చేస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులని ఇబ్బందికరంగా నడిపిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని హేళన చేయడం హాస్యాస్పదంగా ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ ప్రకారం ఇక్కడ ఆర్ ఓ ప్లాంట్స్, డైయాలసిస్ సెంటర్లు రావడం జరిగింది. ఇక్కడ ప్రజానికానికి అడిగితే వాళ్ళు స్వచ్చందంగా పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరిస్తారు.. మీరు మాత్రం మా జిల్లా పర్యటన చేసి తప్పుడు ప్రచారాలు చేసి.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్దాలు ఆడడం ఎంత వరకు సమంజసం అని దాసరి రాజు మండిపడ్డారు.