ఆత్మకూరులో పవనన్న ప్రజాబాట 13వ రోజు

ఆత్మకూరు, రోజుకు సుమారు 4500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఆత్మకూరు మున్సిపల్ బస్టాండులో, ప్రయాణికులకు బస్ షెల్టరు మరియు వసతుల కల్పన ప్రభుత్వానికి, నాయకులకు పట్టదా? జనసేనాని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలన్న దృఢ సంకల్పంతో, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం శుక్రవారం 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ లో ప్రతినిత్యం సుమారు 120 రెగ్యులర్ బస్ సర్వీసులతో, రమారమి 4500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం వీరందరూ నిలువ నీడలేక ఎండకి, వానకి, గాలికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతటి ప్రధానమైన ఈ మున్సిపల్ బస్టాండులో గతంలో ఉన్న ప్రయాణికుల వసతి ప్రాంగణాన్ని, సంవత్సర కాలం క్రితం కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన స్థలంలో అధునాతన సౌకర్యాలతో మరొక ప్రయాణికుల ప్రాంగణాన్ని నిర్మిస్తామని ప్రభుత్వ పెద్దలు సెలవు ఇచ్చిన విషయం మనకు అందరికీ తెలిసినదే. అధునాతన వసతులతో ప్రయాణికుల వసతి ప్రాంగణాన్ని నిర్మించడమే కాకుండా, ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేయాలని శ్రీధర్ పేర్కొన్నారు. 13వ రోజు పవనన్న ప్రజాబాట సందర్భంగా, మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీ మరియు పేరారెడ్డిపల్లిలో పర్యటించి అక్కడ ప్రజల ఇబ్బందులను తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు వంశీ, చంద్ర, తిరుమల, పవన్, హజరత్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొనడం జరిగింది.