బిటివాడ గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

వీరఘట్టం: పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో.. శనివారం వీరఘట్టం మండలం, బిటివాడ గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిటివాడ గ్రామ ప్రజలతో సత్తిబాబు మాట్లాడుతూ.. కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద మనసుతో జనసైనికుల కుటుంబాలకు భద్రతగా జనసేన పార్టీ క్రియాశీలక బీమా పథకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. ఆ గ్రామ మహిళలతో మాటలాడుతూ.. కౌలు రైతుల కుటుంబాలకు భరోసాగా ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 3000 మంది కౌలు రైతులకు 30 కోట్లు ఆర్ధిక సహాయం అందచేశారని తెలియచేసారు. అలాగే మీ బిడ్డలు భవిష్యత్తు బాగుండాలన్న ఉద్యోగాలు రావాలన్నా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనే సాధ్యమవుతుందని తెలియజేసారు. మహిళలతో మాట్లాడుతూ.. సంవత్సరానికి ఆరు గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తారని.. అలాగే రేషన్ కి బదులుగా మహిళల ఖాతాల్లో మీకు కావలసిన సరుకులు మీరే నచ్చినవి కొనుక్కునేట్టు నేరుగా డబ్బులు జమ చెయ్య బడుతుంది. అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకు మధ్య వారధిగా క్రియాశీలక సభ్యులు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండలం జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ వజ్రగడ రవి కుమార్, వండాన సాయి కిరణ్, గర్భాపు నరేంద్ర, పాలకొండ మండల నాయకులు డొంక శివ ప్రసాద్, బిటివాడ గ్రామ ప్రజలు జనసైనికులు పాల్గొన్నారు.