సత్యసాయి జిల్లాలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి
సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలోని క్రియాశీలక సభ్యత్వం తీసుకొని పార్టీ బలోపేతం కోసం మరియు పార్టీ లోని కార్యకర్తలకు అలాగే ప్రతి జనసైనికుడికి అండగా ఐదు లక్షల రూపాయల భీమాను అందేలా కృషి చేసిన వాలంటీర్లకు జనసేన పార్టీ అధ్యక్షుల శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వాలంటీర్స్ అయినటువంటి డాక్టర్ పల్లపు తిరుపతేంద్ర, బోయ వంశీ, తలారి పెద్దన్న, ఆర్.కే.సి మారుతిలను సన్మానించి పుట్టపర్తిలో సభ్యత్వం కిట్లను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అథిధులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పిఏసి సభ్యులు చిలకం మధుసూధన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ అబు, దాసరి రామాంజినేయులు, పత్తిచంద్ర శేఖర్, జిల్లా కార్యదర్శులు బొగ్గరం శ్రీనివాసులు, పుట్టపర్తి మండల అధ్యక్షుడు తలారి పెద్దన్న, మేకల పవన్ కళ్యాణ్, సాయి ప్రభ, చిగిచెర్ల గణేష్, అభి, సూరి రాయల్, మనపురం చంద్ర, పాల ప్రతాప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.