జనసేన ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ

ఆశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం, ములకలపల్లి పంచాయతీ సెంటర్లో బతుకమ్మ ఆడుతున్న ఆడబిడ్డలకు జనసేన పార్టీ తరపున మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు భగత్ సింగ్ నగర్ సుందరయ్య నగర్ గ్రామాలలో బతుకమ్మ ఆడుతున్న ఆడబిడ్డలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ సెక్రటరీ అయిన గరికే రాంబాబు ఆధ్వర్యంలో బతుకమ్మలను అందంగా అలంకరించిన ఆడబిడ్డలకు ఫస్ట్, సెకండ్ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాహ సభ్యుడు గొల్ల వీరభద్రం, ములకలపల్లి మండల ఉపాధ్యక్షుడు పొడిచేటి చెన్నారావు, మండల సెక్రటరీలు బొక్క వెంకటేశ్వర్లుగారు, మేక నరసింహారావు, కార్యకర్తలు నూతి సాయి, కుంజ పాపారావు, అలుగుల శ్రావణ్ కుమార్, పవన్ కళ్యాణ్ వీరాభిమాని గుంపుల రవితేజ, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.