జనసేన ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ కిట్ల పంపిణీ

భీమవరం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా వీరవాసరం విగ్నేశ్వర భారత్ గ్యాస్ ఏజన్సీ వారి ఆధ్వర్యంలో తుందుర్రు జనసేన వారి సహకారంతో తుందుర్రు గ్రామంలో సుమారు 60 మందికి మొత్తం గ్యాస్ కిట్ ఉచితంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్యాస్ ఏజన్సీ తరపున డా. ఆరవ సతీష్, యర్రంశెట్టి వెంకట స్వామి మరియు బీజేపీ జిల్లా ఉప అధ్యక్షులు తోట గంగరాజు, జనసేన మండల అధ్యక్షుడు మోకా శ్రీను ఎంపీటీసీలు అరేటి వాసు, తాతపూడి రాంబాబు, కొట్టు సురేష్, కోయ సూర్యనారాయణ, తోట శ్రీనివాస్, జక్కంపూడి సతీష్ జనసేన తుందుర్రు నాయకులు పాల్గొన్నారు.