వివి వినాయక్ సేవా యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ

  • ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
  • సంస్థ సభ్యులు గండ్రోతు వీర గోవిందరావు, దుర్గా సురేష్

రావులపాలెం: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపైన జాతీయ పతాకం ఎగరాలనే సంకల్పంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలో స్థానిక వివి వినాయక్ సేవా యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో గురువారం ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేసారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గండ్రోతు దుర్గా సురేష్, అధ్యక్షుడు గండ్రోతు వీర గోవిందరావు ఆధ్వర్యంలో జాతీయ జండాలను ఇంటింటికీ పంపిణీ చేసి జాతీయ జెండా ఔన్నత్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జాతీయ జెండాలను ఈనెల 13, 14, 15 తేదీల్లో ఇళ్ళపై ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. తమ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ సేవా యూత్ ను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోస్టు మాస్టర్ కాట్రావులపల్లి రామకృష్ణంరాజు, గండ్రోతు గౌతమ్, పోడూరు చింతారావు, గండ్రోతు గోపాలం, యర్రంశెట్టి రామకృష్ణ, గండ్రోతు మణికంఠ, అడబాల వెంకట కృష్ణ (బాబ్జీ), నరాలశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *