రౌతులపూడి గ్రామంలో జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

ప్రత్తిపాడు నియోజకవర్గం, రౌతులపూడి మండల జనసైనికులు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి), జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండలం జనసేన అధ్యక్షులు గాబు సుభాష్, కత్తిపూడి గ్రామ జనసేన అధ్యక్షులు పోసిన శ్రీను.

ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండలంలో సభ్యత్వాలు చేసిన పక్కుర్తి సతీష్, కర్రి గంగాధర్, నానాజీ (గుమ్మరేగుల), సిగిరెడ్డి మణికంఠ (లేటు), కర్రి విజయ్, గెడ్డం తిరుమల వాలంటీర్లను బాబి అభినందించారు.

అనంతరం జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ రౌతులపూడి మండలం ప్రతీ గ్రామంలో జనసేన పార్టీను, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కౌలు రైతు యాత్ర గురించి అందరికీ తెలిసేలా బలంగా తీసుకెళ్లాలని, జనసైనికులకు ఏ ఇబ్బందులు ఎదురయినా మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.