దుర్గేష్ ను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు ఉందా..?

  • తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు

జనసేన అధ్యక్షుడిని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దుర్గేష్ ను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు ఉందా అని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు ఎద్దేవ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మీ వ్యక్తి గత వ్యాపారాలను, ఆస్తిపాస్తులను, వ్యాపారాలను కాపాడుకోవడానికి, అభివృద్ది చేసుకోవడానికి, రాజకీయం అడుపెట్టుకుంటూ… సొంత పరపతిని సమాజంలో పెంచుకోవడానికి పాకులాడే నాయకులను, నాయకులని చెప్పుకునే దుస్థితి వైసీపీది. వైసీపీ నాయకులుగా చెప్పుకునే వారిది. వార్డులో కార్పొరేటర్ గా గెలవలేనివారు మా జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ను విమర్శలు చేయటం చాలా హస్వస్వదంగా ఉందన్నారు ఎక్స్ ఎమ్మెల్సి గా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు ఆయన హయాంలో జరిగిందని. తూర్పుగోదావరిలో జనసేన పార్టీ బలంగా ఉంది అంటే అందులో దుర్గేష్ పాత్ర చాలా కీలకం అని నాగరాజు తెలిపారు. మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నిటికీ దూరమై కేవలం ప్రజా శ్రేయస్సు కోరుతూ.. సామాన్య ప్రజలకు చేరువగా ఉండాలని, సామాన్యుడి సమస్యలు దూరం చేయాలని, సామాన్యుడి ఆవేదన దూరం చేసే ఆయుధం తాను కావాలని, అన్నిటికీ దూరంగా, ప్రజలకోసం క్షేత్రంలో కృషి చేస్తున్న శ్రమజీవి మా పవన్ కళ్యాణ్. వైసీపీ నాయకులు మాటలడెడ్డపుడు ఒకసారి మీ వైపు చూసుకోండి. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని సొంత ఆస్తుల విలువ గణనీయంగా పెంచుకునే ప్రయత్నాలు కాస్త మానుకుని ప్రజా శ్రేయస్సుకోసం ఇకనైనా ప్రయత్నిస్తే బాగుంటుంది.
మా జిల్లా అధ్యక్షులు దుర్గేష్ అడిగిన పోలవరం ప్రాజెక్టు విషయంలో శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము ఉందని నాగరాజు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న మూడు వేల మంది కౌలు రైతులకు అండగా జనసేనాని కౌలు రైతులను ఆదుకోవడానికి ఎవ్వరూ చేయలేని సహాయం రైతుల కొరకు ఎంతో మేలు చేసే విధంగా అయన ఒక కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున మూడువేల మందికి 30 కోట్లు రూపాయలు రైతులకు ఆర్థిక సహాయంగా ఆదుకుంటున్న మహోన్నతుడు పవన్ కల్యాణ్ అని అలాగే అన్ని వర్గాలకు, రైతులకు, కార్మికులకు, సామాన్యులకు ప్రతి పౌరుడికి సేవ చెయ్యడం కోసం అన్నిటిని వదిలేసి కేవలం ప్రజా సేవకోసమే జనసేనానిగా వచ్చాడు మా పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకోండి. మాటను మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి అని నాగరాజు హితవు పలికారు.