ట్రూ టీం లీడర్ సభ్యులచే అన్నదానం

ప్రత్తిపాడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ట్రూ టీం లీడర్ సభ్యులచే భారీ అన్నదానం జరిగింది. శంఖవరం మండలం అన్నవరం నుంచి ఏలేశ్వరం మండలం యర్రవరం వరకు అన్నదానం భారీగా 500 మందికి భోజనం పంపిణీ జరిగింది జరిగింది. మార్గం మధ్యలో పేద వారికి, దివ్యంగులకు, మానసిక వారికీ,పోలీస్ సిబ్బందికి ఆర్టిశి సిబందికి, మరియు రోడ్డు పనుల వారికి రోడ్డు పక్కన చిరువ్యాపారులకు భోజన పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ వీరాభిమానులు, జనసేన పార్టీ నాయకులు భారీగా వచ్చారు. ఆటోలో భోజనం మరియు బైక్లు మీద ర్యాలీగా బయలుదేరారు. మొదటిగా అన్నవరంలో మొదలయింది అన్నవరంలో శ్రీ సత్యదేవుని గుడి ముందు ఉన్న అనాధులకు ఆహార పంపిణీ జరిగింది మరియు అక్కడ ఉన్న ట్రాన్సజెండర్స్ కు భోజనం పంపిణి చేయడం జరిగింది. అక్కడ ఉన్న ట్రాన్సజెండర్స్ ఈ సారి సిఎం కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారేయ్ అవుతారు అని పవన్ కళ్యాణ్ గారిని దీవించారు. తర్వాత అన్నవరంలో రోడ్డు మార్గంలో ఉన్న పేదలకు భోజన పంపిణీ జరిగింది.మరియు అన్నవరం లో ఉన్న శాంతి వర్ధన వికలాంగుల పాఠశాల లో పిల్లలకు భోజన పంపిణీ జరిగింది. తర్వాత బెండపూడి, సీతంపేట గ్రామల హైవే రోడ్ మీదుగా అన్నదానం జరిగింది. కత్తిపూడి లో ఉన్న కాంప్లెక్స్ దగ్గర ఉన్న మరియు బ్రిడ్జి కింద ఉన్న వృద్దులకు మరియు మరియు నిశహాయాలకు ఆహార పంపిణి జరిగింది. ఎన్.హెచ్ 16 జాతీయ రహదారిని అనుకుని ఉన్న వన్నిపూడి, చెందుత్తి ధర్మవరం మీదుగా అన్నదానం జరిగింది. తర్వాత ప్రత్తిపాడులో బస్ కాంప్లెక్స్ దగ్గర అన్నదానం జరుగుతుందగా అటుగా వెళ్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు, ఏలేశ్వరం మండల అధ్యక్షులు పెంటకోట మొహన్, జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, వరుపుల సాయి గారు మరియు జనసేన నాయకుల చేతుల మీదుగా ప్రత్తిపాడులో ఉన్న పేదవారికి మరియు హైవే కి ఆనుకుని ఉన్న పాధలమ్మా గుడి దగ్గర ఉన్న వృద్దులకు ఆహార పంపిణీ జరిగింది తర్వాత యర్రవరంలో మరియు ఏలేశ్వరంలో ఆహార పంపిణి జరిగింది.