అక్రమ కేసులపై అధైర్యపడవద్దు

* ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులతో పిఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్మబద్దంగా పోరాటం చేస్తున్న జన సైనికులు, వీర మహిళలపై అక్రమ కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో మనం చేయని నేరానికి మన మీద ఏ విధమైన కేసులు నమోదు చేసినా అధైర్యపడవద్దని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాదులో నాగబాబు గారిని ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు కలిశారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతున్న విధానాన్ని చూసి తట్టుకోలేక అధికార వై.సీ.పీ. ప్రభుత్వం అక్రమ కేసులతో కార్యకర్తలను అణచి వేయాలని చూస్తే ఊరుకునేది లేదని చెప్పారు. ప్రతీ గ్రామంలోని పార్టీ శ్రేణులు అంతా సంఘటితంగా పని చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పాల్గొన్నారు.
* రూ. 1.50 లక్షలు, రూ. 50 వేలు చెక్ ల అందజేత
‘నా సేన కోసం-నా వంతు’ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం బలిజపాలెంకు చెందిన ప్రవాస భారతీయుడు ఉమ్మడిశెట్టి నాగేంద్ర, అంగునూరి నరసింహారావు, కొణిదెల శ్రీనివాసులు, ఉన్నం వెంకటేశ్వర్లు సమష్టిగా రూ.1.5 లక్షలు విరాళం చెక్కు రూపంలో, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి చెందిన శ్రీ షేక్ కరీముల్లా, మణికంఠ మహేష్ సమష్టిగా రూ. 50 వేలు విరాళం చెక్కు రూపంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు గారి చేతుల మీదుగా జనసేన పార్టీకి అందజేశారు.