పాము కాటుకు గురైన జనసైనికుని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

  • పాము కాటుకు గురై ప్రాణాపాయస్తితి నుంచి కోలుకున్న సీనియర్ జనసైనికులు ఓరుగంటి పెద్దకాపు ను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, చేబ్రోలు గ్రామం నందు మన ఓరుగంటి పెద్ద కాపు ప్రజారాజ్యం నుండి పార్టీ కోసం పనిచేస్తు జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఓరుగంటి పెద్దకాపు ను పాము కరచి.. హాస్పటల్ లో చికిత్స పొంది.. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన పెద్దకాపుని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించడం జరిగింది. అనంతరం తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తగిన సూచనలు సలహాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార నాయకులు పల్లెటి బాపన్న దొర, ఇంటి వీరబాబు, రావుల వీరభద్రరావు, పెద్దింటి శివ, గొల్లపల్లి శివ, బుద్ధ చంటిబాబు, ఏ దొరబాబు, మల్లయ్య, ఓరుగంటి రాంబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.