టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ECIL నోటిఫికేషన్

ECIL- హైదరాబాద్‌ 17 టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 17 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

 మొత్తం ఖాళీలు- 17

హైదరాబాద్‌- 9

దుర్గాపూర్- 2

 కొచ్చిన్- 1

ముంద్రా- 1 ముంబై- 2

చండీగఢ్‌- 1

చెన్నై- 1

ముఖ్య సమాచారం:

విద్యార్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ లేదా బీఈ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.23 వేలు.

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2020

వయస్సు: 2020 ఆగస్ట్ 31 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

 ఎంపిక విధానం: బీటెక్ లేదా బీఈలో వచ్చిన మార్కుల ఆధారంగా దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.

వెబ్‌సైట్‌:http://careers.ecil.co.in/