ఘనంగా ఎన్ని రాజు జన్మదిన వేడుకలు

రాజాం: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకులు, న్యాయవాది, రాజాం నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో అండగా నిలుస్తూ.. జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలూ పని చేస్తున్న నాయకులు ఎన్ని రాజు జన్మదినం సందర్బంగా శుక్రవారం ఆయనకు రాజాం నియోజకవర్గం నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున స్థానిక రాజాం పార్టీ కార్యాలయంలో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎన్ని రాజు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సిబిరంలో దదపు 30 మంది జనసైనికులు, వీర మహిళలు రక్తదానం చేశారు. అనంతరం స్థానిక రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులందరికీ ఎన్ని రాజు స్వయంగా జనసైనికులతో కలిసి పండ్లు వితరణ కార్యక్రమం చేశారు.