గర్భాన సమక్షంలో జనసైనికుడికి మందుల ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సాయం

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం బీసీ కాలనీలో నివాసముంటున్న జనసైనికుడు మధుకి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. విషయాన్ని తెలుసుకున్న జనసైనికులు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు చొరవతో కొంతమంది నియోజకవర్గ జనసైనికులు మందుల ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయాన్ని సత్తిబాబు సమక్షంలో అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా సహాయం చేసిన జనసైనికులు ఆరంగి హరి ప్రసాద్, గొర్ల మన్మధ రావు, సంతోష్ కుమార్, విశ్వనాథ్ (ఎస్ వి ఆర్), కొల్లా రవీంద్ర, కంబర శివ, పొట్నూరు గౌరీ శేంకర్, సాంబ, బొద్ధాన ఏసులకు సత్తిబాబు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.