జికె ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ పేషేంటుకు ఆర్ధికసాయం

విశాఖపట్నం, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో 33వ వార్డులో మీతో మీ కార్పొరేటర్ అనే కార్యక్రమంలో భాగంగా గౌరీ వీధి, వేంకటేశ్వర మెట్ట వాస్తవ్యులు కంచుమోజు లక్ష్మీ గత కొన్ని నెలలుగా క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్నట్లు 33వ వార్డ్ జనసేన కార్పొరేటర్ మరియు జివిఎంసి ఫ్లోర్ లీడర్ అయిన శ్రీమతి భీశెట్టి వసంతలక్ష్మి దృష్టికి రావడంతో, జనసేన దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపీకృష్ణ(జికె), జికె ఫౌండేషన్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతి నెల ₹1000/- అందిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈనెల 3వ చెక్కు(3*1000=3000/-) అందించడం జరిగింది.