గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 11వ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం పదకొండవ రోజు జనసేనపార్టీ ఆధ్వర్యంలో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా జోరు వానలో రైతులను కలిసిన వీరఘట్టం జనసైనికులు. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా వచ్చు నీరు పాలకొండ నియోజకవర్గం పరిధిలో చివర భూములకు నీరు అందడం లేదు, కాలువలకు గండి ఏర్పడి నీరు వృధాగా పోతుంది, రైతుభరోసా కేంద్ర పేరుకే తప్ప రైతులకు ఉపయోగం లేదని, ధాన్యం కొనుగోలు చేసిన సకాలంలో డబ్బులు ప్రభుత్వం చెల్లించటం లేదని, రైతులను ఆదుకోవాలని వీరఘట్టం జనసైనికులకు సమస్యలు వివరించిన వీరఘట్టం రైతన్నలు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గంలో అనేక గ్రామాల పంట భూములకు సాగునీరు అందడం లేదు, తోటపల్లి ఎడమ కాలువకి అనుబంధ కాలువలను అభివృద్ధి చేయాలి, తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో భూముల కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది అని ప్రశ్నించారు? రైతులుకష్టాల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో రైతులకు అందంగా జనసేన పార్టీ ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కౌలురైతు భరోసా యాత్రలో ఒకొక్క కుటుంబానికి లక్ష రూపాయలు అందిస్తున్నారు అని రైతులకు తెలియజేశారు. రైతులకు జనసేన మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించారు. జనసేన జాని మాట్లాడుతూ ప్రస్తుత వైసిపి పరిపాలనలో రైతుల ఆత్మహత్యలు తప్ప, రైతులను ఆదుకోవడం లేదని అన్నారు. గ్రామాల్లో జనసేన పార్టీ తరుపున రైతులతో సమావేశాలు నిర్వహించి, వాళ్ళ సమస్యలు తెలుసుకుని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవిధంగా కృషి చేస్తామని తెలిపారు. రైతులకు అండగా జనసేన పార్టీ అండగా ఉంటుందని, రైతుల పక్షాన నిలబడి రైతుల సమస్యలపై పోరాడతామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భగా ఉత్తరాంధ్ర జనసేన పార్టీ సీనియర్ నాయకులు బి.పి.నాయుడు మాట్లాడుతూ ఎడమ కాలువ ఆధునికి కరణ పనులు త్వరగా పూర్తిచేయాలని, కుడి కాలువ ద్వారా భూమికోల్పోయిన రైతులకు ఏకరాకు 40 లక్షలు నష్టరిహారాన్ని ఇవ్వాలని, అలాగే తోటపల్లి నీరును తక్షణమే విడుదల చేసి, చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రైతుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తారని, గిట్టుబాటు ధరలు కల్పిస్తారని తెలిపారు. కర్ణేన సాయి పవన్ మాట్లాడుతూ రైతన్నలు అందరు పవనన్నకు అండగా ఉండాలని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దూసి ప్రణీత్, చింత గోవర్ధన్, కలిపిల్లి సింహాచలం, వాన మహేష్, వావిలపల్లి నాగభూషన్, దత్తి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.